News March 9, 2025
భట్టిప్రోలు: బంగారంతో ఛాంపియన్స్ ట్రోఫీ తయారీ

అంతర్జాతీయ క్రికెట్ వన్డే ఇంటర్నేషనల్ ఛాంపియన్ ట్రోఫీకి, మండలంలోని ఐలవరం గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మాచర్ల వీరేంద్ర 1.60 గ్రాముల బంగారంతో ట్రోఫీకి సంబంధించిన కప్పు, బ్యాట్, పిచ్, వికెట్లను తయారు చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో క్రికెట్ ప్రేమికులను కనువిందు చేసేందుకు ట్రోఫీని పెట్టనున్నట్లు వీరేంద్ర తెలిపారు. క్రికెట్ మీద ఇష్టంతో ఈ ట్రోఫీని తయారు చేసినట్లు వీరేంద్ర తెలిపారు.
Similar News
News September 15, 2025
విశాఖలో ‘స్వస్త్ నారి-సశక్త్ పరివార్’ అభియాన్

విశాఖ జిల్లాలో మహిళల ఆరోగ్యం కోసం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు “స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ జగదీశ్వరరావు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, గర్భిణుల పరీక్షలు, పిల్లలకు టీకాలు వేస్తారన్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 15, 2025
లిక్కర్ స్కాం: మరో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఇవాళ మరో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంతో కలిపి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లయింది.
News September 15, 2025
భద్రాద్రి: రైతు వేదికనా.. బర్లకు వేదికనా..?

ఆల్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక గేదెలకు నిలయంగా మారింది. సంబంధిత అధికారుల నిర్వహణ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రైతు వేదిక చుట్టూ ఉన్న ఫెన్సింగ్ సరిగా లేకపోవడంతో గేదెలు లోపలికి చొరబడుతున్నాయి. దీంతో అవి అందులో నాటిన మొక్కలను నాశనం చేస్తున్నాయి. అటుగా వెళ్తున్న రైతులు ఈ దృశ్యాన్ని చూసి ‘ఇది రైతు వేదికనా.. బర్ల వేదికనా?’ అంటూ నవ్వుకుంటున్నారు. నిర్వహణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.