News March 9, 2025
భట్టిప్రోలు: బంగారంతో ఛాంపియన్స్ ట్రోఫీ తయారీ

అంతర్జాతీయ క్రికెట్ వన్డే ఇంటర్నేషనల్ ఛాంపియన్ ట్రోఫీకి, మండలంలోని ఐలవరం గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మాచర్ల వీరేంద్ర 1.60 గ్రాముల బంగారంతో ట్రోఫీకి సంబంధించిన కప్పు, బ్యాట్, పిచ్, వికెట్లను తయారు చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో క్రికెట్ ప్రేమికులను కనువిందు చేసేందుకు ట్రోఫీని పెట్టనున్నట్లు వీరేంద్ర తెలిపారు. క్రికెట్ మీద ఇష్టంతో ఈ ట్రోఫీని తయారు చేసినట్లు వీరేంద్ర తెలిపారు.
Similar News
News March 22, 2025
మంత్రి పొన్నంను కలిసిన కరీంనగర్ సీపీ

కరీంనగర్ సీపీగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన గౌస్ అలం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మంత్రిని సీపీ కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, ప్రజా భద్రతల రక్షణ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను గురించి వారు చర్చించారు.
News March 22, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

కామారెడ్డి జిల్లాలో నమోదైన ఎండ ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూరు, నసురుల్లాబాద్, పిట్లంలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాల్వంచ, నిజాంసాగర్, రామారెడ్డి, బిచ్కుంద, రాజంపేట, బిక్కనూరు, కామారెడ్డి, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో 37.7 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఎండల తీవ్రత ఎక్కువవ్వడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News March 22, 2025
రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. UPDATE

TG: పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వేదిక ఖరారైంది. ఉగాది రోజున సూర్యాపేటలోని మట్టపల్లి ఆలయం నుంచి ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు 6కేజీల చొప్పున సన్నబియ్యం అందుకోనున్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనున్నారు.