News April 10, 2025

భట్టిప్రోలు: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు

image

మద్యం మత్తులో కన్నతల్లిని కడతేర్చినట్లు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఎస్ఐ ఎం శివయ్య బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. భట్టిప్రోలుకు చెందిన బసవపూర్ణమ్మ(74) పెద్ద కుమారుడు దుర్గారావు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం అతను తల్లిని దూషిస్తూ, డబ్బుల కోసం వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమె డబ్బులు ఇవ్వకపోవటంతో తల్లిని హతమార్చాడన్నారు. వేమూరు సీఐ వీరాంజనేయులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

Similar News

News November 26, 2025

GNT: ఈ పరిస్థితి మీ ప్రాంతంలో కూడా ఉందా.?

image

ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పలువురు నాయకులు సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఇతర పార్టీలకు చెందినవారు అధికార పార్టీ వైపు క్యూ కడుతున్నారు. గతంలో వ్యతిరేకంగా పనిచేసినవారె, ఇప్పుడు కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు స్థానికంగా ప్రచారం సాగటంతో, మళ్లీ వారికే ప్రాముఖ్యత వస్తె తమ పరిస్థితి ఏమిటని? కూటమి వాపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News November 26, 2025

నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

image

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్‌గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.

News November 26, 2025

నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

image

నెల్లూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం వద్ద తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్‌ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని జలదంకి పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.