News December 23, 2024

భద్రకాళి అమ్మవారికి ఈరోజు అలంకరణ ఇదే

image

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని ఈరోజు అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. నేడు అష్టమి తిథి, సోమవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే తరలి వస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News December 23, 2024

HNK: సిద్దేశ్వరునికి ప్రత్యేక అలంకరణ

image

హన్మకొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభూ లింగం శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో నేడు మార్గశిర మాసం సోమవారం ఆలయ అర్చకులు సిద్దేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేశ్ తదితరులున్నారు.

News December 23, 2024

సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు, అధికారులకు మంత్రి కొండా సురేఖ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 135 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన సింగరేణి ప్రగతి పథాన సాగుతూ దేశానికి వెలుగులు నింపుతుండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సింగరేణి మరో శత వసంతాలు ఉజ్వలంగా దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలవాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

News December 23, 2024

వరంగల్ జిల్లాలో మొదలైన వరినాట్లు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు మొదలయ్యాయి. కూలీలు పాటలు పాడుతూ నాట్లు వేస్తుండటంతో పంట పొలాల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే పలు చోట్ల ఇప్పుడే మడులు ఏర్పాటు చేసుకొని నారు అలుకుతుండగా.. పలు గ్రామాల్లో మాత్రం నాట్లు వేస్తున్నారు. అంతేకాదు.. చలి, మంచు కురుస్తుండటంతో నారు సైతం ఎదగకపోవడం, ఎరుపెక్కడం వంటి ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. మీ పొలంలో నాటు పూర్తయితే కామెంట్ చేయండి.