News November 22, 2024

భద్రకాళి అమ్మవారికి పూర్ణాభిషేకం

image

కార్తీక మాసంలో భాగంగా నేడు శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆలయ అర్చకులు పూర్ణాభిషేకం నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి పూర్ణాభిషేకానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి భజనలతో ఆలయం మార్మోగింది. నేడు మీరూ భద్రకాళి ఆలయానికి వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.

Similar News

News December 9, 2024

సిద్దేశ్వరస్వామి వారికి ప్రత్యేక అలంకరణ

image

హన్మకొండలోని స్వయం భూ లింగం శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయంలో మార్గశిర మాసం సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అలంకరించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేశ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2024

ములుగు: నేడు మావోయిస్టుల బంద్.. టెన్షన్.. టెన్షన్

image

నేడు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరునాగారం ఏజెన్సీలో పోలీసులు ఆదివాసీ గూడాలు, అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎస్ఔ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పలు లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జీల్లో ఉన్నారా..? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.

News December 8, 2024

ప్రత్యేక రూపంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈ రోజు ఆదివారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.