News December 18, 2024

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

image

తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో నేడు బుధవారం ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 21, 2026

తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రానున్న వేసవిలో జిల్లాలోని 698 హ్యాబిటేషన్లలో నివసిస్తున్న 1,16,934 కుటుంబాలకు, నల్లా కనెక్షన్లు లేని 1,784 గృహాలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి వేసవి ప్రణాళికపై సమీక్షించారు.

News February 21, 2026

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ పనులు చేపట్టాలి: కలెక్టర్

image

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయ్‌తో కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రోడ్డు పనుల విషయంలో భూసేకరణ చేపట్టాలన్నారు.

News February 20, 2026

వరంగల్: తనిఖీలు లేకనే .. ఉపాధ్యాయుల గైర్హాజరు!

image

ప్రభుత్వ పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేనందునే ఉపాధ్యాయులు విధులకు హాజరై డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని నెక్కొండ మండలంలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డీఈవో రంగయ్య నాయుడు శుక్రవారం సస్పెండ్ చేసిన క్రమంలో విద్యాశాఖ అధికారులు ఇన్నాళ్లకు మేల్కొన్నారా..!? అంటున్నారు. కొందరు హెచ్ఎంల కారణంగానే టీచర్లు డుమ్మా కొడుతున్నట్లు చర్చ సాగుతోంది.