News April 14, 2025

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

image

భద్రకాళి అమ్మవారు సోమవారం సందర్భంగా భక్తులకు ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమంలో అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను సమర్పించారు. భక్తులు అమ్మవారి దివ్యదర్శనాన్ని పొందేందుకు భక్తులు తరలిరావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది.

Similar News

News November 26, 2025

విశాఖ రివ్యూ మీటింగ్‌లో MLA మద్దిపాటి

image

ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం విశాఖ కలెక్టరేట్‌లో జరిగిన అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యుని హోదాలో రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఎస్టిమేట్‌కి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, విశాఖ కలెక్టర్‌తో పాటుగా ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News November 26, 2025

ఏలూరులో మంత్రి మనోహర్ నేతృత్వంలో జిల్లా సమీక్ష

image

ఏలూరు కలెక్టరేట్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, గృహాల పురోగతి, 22A కేసులు, విశాఖ CII సమ్మిట్ అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ వివిధ శాఖల పురోగతిపై నివేదిక ఇచ్చారు. మంత్రి పార్థసారథి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

News November 26, 2025

బెట్టింగ్‌లతో అప్పులు.. గన్ తాకట్టు పెట్టిన ఎస్ఐ!

image

TG: హైదరాబాద్ అంబర్‌పేట్ SI గన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతోపాటు తన సర్వీస్ గన్‌ను SI భాను ప్రకాశ్ తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేశారని, బెట్టింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగారం, తుపాకీ తాకట్టు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.