News April 6, 2025
భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయ అర్చకులు అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
Similar News
News April 8, 2025
ఖానాపురం: రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే

ఖానాపురం మండల కేంద్రంలో ముస్తఫా అనే రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సన్న బియ్యం భోజనం చేశారు. ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పథకాన్ని చేపడుతోందని దొంతి అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, ఆర్డీవో ఉమారాణి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News April 8, 2025
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి: వరంగల్ కలెక్టర్

యాసంగి ధాన్యం కొనుగోలు కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్య శారద దేవి తెలిపారు. ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 2024-25 సంవత్సరానికి 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు.
News April 7, 2025
ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: గంట రవికుమార్

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. సోమవారం శివనగర్లో ఓ రేషన్ షాపు వద్ద నరేంద్ర మోదీ ఫొటో పెట్టి మాట్లాడారు. రేషన్ బియ్యం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైసలు ఇస్తుంటే.. మొత్తం తామే ఇస్తున్నట్టు కాంగ్రెస్ గప్పాలు కొడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఉన్నారు.