News March 25, 2025

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

image

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం మంగళవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి, భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.

Similar News

News October 25, 2025

ఇంటర్లో ఇంటర్నల్ విధానంతో మరిన్ని సమస్యలు: GJLA

image

TG: INTERలో 20% ఇంటర్నల్, 80% ఎక్స్‌టర్నల్ మార్కుల విధానం వల్ల ప్రమాణాలు పడిపోతాయని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ వల్ల ప్రాక్టికల్స్ ప్రహసనంగా మారాయి. ఇంటర్నల్ మార్కుల విధానం పెడితే ఆ సంస్థలు ఇష్టానుసారం ప్రవర్తిస్తాయి. ప్రమాణాలు మరింత దిగజారుతాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి’ అని సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

News October 25, 2025

డిప్యూటీ ఈవోల బదిలీ తాత్కాలికంగా నిలుపుదలకు కారణం అదేనా?

image

TTDలో వివిధ విభాగాల్లోని డిప్యూటీ ఈవోల బదిలీలు ఈనెల 8న జరిగినా.. రెండురోజుల తర్వాత పై నుంచి ఆదేశాలు వచ్చే వరకు యథాస్థానంలోనే కొనసాగాలని వారికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే తాత్కాలికంగా వాయిదా చేయడానికి రాజకీయల ఒత్తిళ్లు కారణమా..? మరేమైనా కారణాలు ఉన్నాయా…? అని ఉద్యోగుల్లో చర్చ సాగుతోందట. త్వరలోనే పాలకమండలి సమావేశం అనంతరం మళ్ళీ బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

News October 25, 2025

దూసుకొస్తున్న తుఫాను

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని APSDMA తెలిపింది. ఇది ప్రస్తుతానికి పోర్ట్‌బ్లెయిర్‌కి 420KM, విశాఖకు 990KM, చెన్నైకి 990KM, కాకినాడకు 1000KM దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి, ఎల్లుండికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో రాష్ట్ర తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది.