News August 13, 2024
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ యాంకర్ సుమ
వరంగల్ భద్రకాళి అమ్మవారిని ప్రముఖ యాంకర్ సుమ దర్శించుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనకు అమ్మవారు పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని యాంకర్ సుమ నేడు ట్వీట్ చేశారు. ప్రముఖ యాంకర్ సుమతో పలువురు జిల్లా వాసులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.
Similar News
News September 18, 2024
రైలు కిందపడి కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య
రైలు కిందపడి కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన విజ్ఞాన్(32) తల్లి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తల్లికి ఏమైనా జరుగుతుందేమోనని భయాందోళనకు గురైన విజ్ఞాన్ చింతలపల్లి రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
News September 18, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> MHBD: చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి..
> WGL: మట్కా నిర్వహిస్తున్న మహిళా అరెస్టు..
> MHBD: బైక్ అదుపు తప్పి ఒకరికి తీవ్ర గాయాలు…
> WGL: బట్టల బజార్ మ్యాచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం..
> MHBD: గంజాయి పట్టివేత…
> WGL: మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం…
> WGL: అనారోగ్యంతో ప్రయాణికుడు మృతి…
News September 17, 2024
WGL: ఘోరం.. మతిస్తిమితం లేని మహిళపై అఘాయిత్యం
MHBD(D) కేసముద్రం(M)లో మతిస్తిమితం లేని మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 10న ఇద్దరు యువకులు సదరు మహిళ ఇంటికి వెళ్లారు. వారిలో ఒకరు ఆమె కొడుకును బయటకు తీసుకెళ్లగా, మరొక వ్యక్తి అత్యాచారం చేశాడు. బయటకు వెళ్లేటప్పుడు ఆమె కొడుకు ఫోన్‌లో వీడియో రికార్డింగ్ పెట్టి వెళ్లడంతో ఈ విషయం బయటపడింది. మహిళ కుటుంబం ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది.