News August 19, 2024
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News September 14, 2024
దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయింది: సీతక్క
దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా సీతారాం ఏచూరి గుర్తింపు పొందారని, దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసుకున్న ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని అన్నారు.
News September 13, 2024
జనగామ: పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించాలి: కలెక్టర్
జనగామ కలెక్టర్ కార్యాలయంలో సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ లతో ఎస్ఎస్ఎఫ్పీ కార్య నిర్వహణపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లో టీచర్లు పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించి, ప్రతి 15 రోజులకోసారి సరైన పద్ధతిలో బరువులు, ఎత్తు కొలతలను తీసి ఆన్‌లైన్‌లో సరైన విధంగా నమోదు చేయాలన్నారు. సీడీపీఓలు రమాదేవి, మహేశ్ తదితరులున్నారు.
News September 13, 2024
అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎమ్మెల్సీ
MHBD: బీఆర్ఎస్ ముఖ్య నేతల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రశ్నించే వారిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతూనే ఉంటామన్నారు.