News February 20, 2025

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్

image

ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారిని ప్రముఖ తెలుగు చిత్ర హీరో గోపీచంద్ దర్శించుకున్నారు. గోపీచంద్‌కు అర్చకులు, ఆలయ ఈవో శేషు భారతి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి శేష వస్త్రములను బహూకరించి ప్రసాదములు అందజేశారు.

Similar News

News October 30, 2025

పెరిగిన బంగారం ధరలు

image

కొంతకాలంగా రోజులో రెండుసార్లు బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ <<18146766>>ఉదయం<<>> 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,910 తగ్గగా ఇప్పుడు రూ.990 పెరిగి రూ.1,21,480కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ రేట్ ఉదయంతో పోల్చితే రూ.900 ఎగబాకి రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 30, 2025

ముంపు గ్రామాల్లో పంటల పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పంటల నష్టం, ప్రజల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

News October 30, 2025

రేపు అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం!

image

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.