News March 15, 2025

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శనివారం ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు తదితరులున్నారు.-

Similar News

News December 2, 2025

నెల్లూరు జిల్లాకు ఏమైంది……?

image

ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏమైంది. ఒకవైపు గూడూరు ప్రజలేమో నెల్లూరులో తమ నియోజకవర్గాన్ని కలపాలని నిరసనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నెల్లూరులో లేడీ డాన్లు గంజాయి ముఠాతో హత్యలు చేయిస్తున్నారు. గతంలో ఇదే గడ్డ మీద ఎందరో మహానుభావులు హుందాగా రాజకీయాలు చేశారు. అలాంటి నెల్లూరు జిల్లా గడ్డ మీద నేడు ఈ పరిస్థితులు చూస్తున్నావారు నెల్లూరు జిల్లాకు ఏమైంది అంటూ ఆలోచనలో పడ్డారు.

టెస్లా కార్లపై ఆసక్తి చూపని భారతీయులు!

image

భారతీయ మార్కెట్‌లో టెస్లా కార్లకు ఆశించిన స్థాయిలో స్పందన లభించట్లేదు. OCTలో 40, NOVలో 48 కార్లే అమ్ముడయ్యాయి. JULY నుంచి ఇప్పటి వరకు మొత్తం 157 కార్లనే విక్రయించింది. అధిక ధరలు, విపరీతమైన పోటీ కారణంగా ఇండియన్స్ ఆసక్తి చూపట్లేదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్ల కొరత కూడా అమ్మకాలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు. కాగా మోడల్ Y ధర రూ.60లక్షలకు పైగా ఉంది.