News February 20, 2025
భద్రకాళి అమ్మవారి దివ్య రూప దర్శనం

వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు మాఘమాసం గురువారం, సప్తమి తిథి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి, భక్తులకు దివ్యరూప దర్శనం కల్పించారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News November 15, 2025
జూబ్లీహిల్స్ ఎన్నికలో అత్యల్ప ఓట్లు ఎవరికంటే..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 58 మంది అభ్యర్థుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్ రవీందర్ నాయక్కు అత్యల్పంగా 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. తార్నాకకు చెందిన రాథోడ్ రవీందర్ నాయక్ ఎంఏ ఆంగ్లం పూర్తి చేశాడు. కాగా, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

హత్యగా నిర్ధారిస్తూ కేసు నమోదు

TTD మాజీ ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ <<18292217>>మృతి<<>>ని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి జీఆర్పీ పీఎస్లో కేసు నమోదైంది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నం.75/2025గా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ కుమార్ TTD పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఈనెల 6న CID విచారణకు వెళ్లిన ఆయన.. నిన్న మరోసారి విచారణకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.