News February 20, 2025

భద్రకాళి అమ్మవారి దివ్య రూప దర్శనం

image

వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. నేడు మాఘమాసం గురువారం, సప్తమి తిథి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి, భక్తులకు దివ్యరూప దర్శనం కల్పించారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

Similar News

News March 17, 2025

అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

News March 17, 2025

ధర్మవరం: చిగిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం. 

image

ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న బోయ నారాయణ స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ద్విచక్ర వాహనంలో వస్తుండగా చిగిచెర్ల వద్ద మరో వాహనం ఢీకొనడంతో నారాయణ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నారాయణ స్వామి మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

News March 17, 2025

విశాఖ నుంచి HYD ట్రావెల్స్ బస్సులో మంటలు

image

విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం స్వల్పమే అయినప్పటికీ బస్సు నిలిపివేయడంతో ప్రత్యామ్నాయంగా రావాల్సిన బస్సు రెండు గంటలు కావస్తున్నా రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా నక్కపల్లి హైవేపై చోటు చేసుకుంది. బస్సు వెళ్తుండగా వెనక చక్రాల డమ్ములు గట్టిగా పట్టేయడంతో స్వల్ప మంటలు చేలరేగాయి. ఈ ఘటన 9 గంటలకు జరిగింది.

error: Content is protected !!