News February 8, 2025

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘమాసం శనివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.

Similar News

News February 9, 2026

మంగళగిరిలో మేఘాలయ బృందం పర్యటన

image

‘ఎనీమియా ముక్త్ భారత్’ పరిశీలన ఆంధ్రప్రదేశ్‌లో’ ఎనీమియా ముక్త్ భారత్’ అమలు తీరును పరిశీలించేందుకు మేఘాలయ NHM ఉన్నతాధికారుల బృందం సోమవారం మంగళగిరిలో పర్యటించింది. స్థానిక ఉన్నత పాఠశాల, పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రక్తహీనత నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో AP అగ్రస్థానంలో ఉన్నందున క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చామని అధికారులు తెలిపారు. రేపు అంగన్వాడీ, PHCలను ఈ బృందం సందర్శించనుంది.

News February 9, 2026

రాష్ట్రస్థాయిలో కాకినాడ సిటీకి మూడో ర్యాంకు

image

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నియోజకవర్గాల ర్యాంకుల్లో కాకినాడ సిటీ సత్తా చాటింది. వివిధ అంశాల్లో 77 ఇండికేటర్లను పరిగణనలోకి తీసుకోగా, 92 స్కోరుతో రాష్ట్రస్థాయిలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. A+ కేటగిరీలో నిలవడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా కాకినాడకు దక్కిన గౌరవంగా దీన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.

News February 9, 2026

BREAKING: HYDలోని హాస్టళ్లలో తనిఖీలు

image

నగరంలోని PG హాస్టళ్లపై ఖాకీ నిఘా మొదలైంది. ‘ఇకపై ఆటలు సాగవు.. నిబంధనలు పాటించాల్సిందే’ అంటూ మియాపూర్ పోలీసులు నిర్వాహకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్వోసీ, ఎఫ్ఎస్‌ఎస్ఏఐ సర్టిఫికెట్లు లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ సెక్టార్ వారీగా రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని ఆదేశించారు.