News February 10, 2025

భద్రకాళి చెరువులో ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి?

image

సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఐలాండ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గతంలోనే ప్రభుత్వం కసరత్తు చేయగా.. ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2016-17లో రూ.2.78 కోట్లతో తీగల వంతెన ప్రతిపాదించినా ముందడుగు వేయలేదు. అయితే నిర్మాణం పూర్తైతే లక్నవరంను మించిన టూరిస్ట్ స్పాట్‌గా భద్రకాళి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News April 16, 2026

KMR: నేటితో ముగిసిన పదో తరగతి పరీక్షలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురువారంతో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 100 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో రాజు వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, మాల్‌ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. విద్య, వైద్య, పోలీసు అధికారుల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.

News April 16, 2026

27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

image

శాశ్వత ప్రాతిపదికన 27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి పంజాబ్‌ & సింధ్‌ బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.64,820-93,960గా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 5-5-26. పూర్తి వివరాలకు www.punjabandsind.bank.in చూడండి.

News April 16, 2026

సిరిసిల్ల: పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం: ఎస్పీ

image

ఎండల తీవ్రత దృష్ట్యా విధుల్లో ఉన్న పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందికి ఆయన కూలింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. భానుడి భగభగలకు సిబ్బంది ఇబ్బంది పడకూడదని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.