News February 10, 2025
భద్రకాళి చెరువులో ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి?

సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఐలాండ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గతంలోనే ప్రభుత్వం కసరత్తు చేయగా.. ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2016-17లో రూ.2.78 కోట్లతో తీగల వంతెన ప్రతిపాదించినా ముందడుగు వేయలేదు. అయితే నిర్మాణం పూర్తైతే లక్నవరంను మించిన టూరిస్ట్ స్పాట్‌గా భద్రకాళి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News February 16, 2026
HYD: నిరుద్యోగులకు GOOD NEWS

HYDలోని కేంద్రీయ విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతో పాటు (CTET) అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
News February 16, 2026
ఖమ్మం: నేడే ఎంపిక.. తీవ్ర ఉత్కంఠ..!

ఉమ్మడి ఖమ్మంలోని 7 మున్సిపాలిటీలకు ఛైర్మన్‌లు ఎవరనేది మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. పదవులపై ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ ఎంపిక విధానంపై అంతర్గతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. స్థానిక సామాజిక సమీకరణాలు, నాయకత్వానికి సమీపత వంటి అంశాలు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. అధిష్టానం తుది నిర్ణయం మేరకే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఖరారుకానున్నాయి. కొత్తగూడెం మేయర్ ఖరారైన విషయం తెలిసిందే.
News February 16, 2026
నెల్లూరు: అడవిలో తప్పిపోయిన 12 మంది భక్తులు సేఫ్

రాపూరు (M) పంగిలి గ్రామ సమీపంలోని మామిడికొనలో ఉన్న వెలసిన శ్రీ మల్లయ్యస్వామి వారి దర్శనార్థం నెల్లూరు సిటీ అయ్యప్ప గుడి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది టెంపోలో వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో పంగిలి గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో చీకటి కారణంగా 12 మంది దారి తప్పిపోయారు. పోలీసులు గాలించి వారిని బంధువులకు అప్పగించారు.


