News February 10, 2025
భద్రకాళి చెరువులో ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి?

సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఐలాండ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గతంలోనే ప్రభుత్వం కసరత్తు చేయగా.. ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2016-17లో రూ.2.78 కోట్లతో తీగల వంతెన ప్రతిపాదించినా ముందడుగు వేయలేదు. అయితే నిర్మాణం పూర్తైతే లక్నవరంను మించిన టూరిస్ట్ స్పాట్గా భద్రకాళి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 2, 2025
ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

ప్రయాణాల్లో వాంతులు అవడం అనేది సాధారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య. వికారంగా అనిపించడం, తల తిరగడం, పొట్టలో అసౌకర్యంగా ఉండడం ఇవన్నీ మోషన్ సిక్నెస్ లక్షణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్ సమస్యను మరింత పెంచుతాయి.
News November 2, 2025
కీలక వికెట్లు కోల్పోయిన భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), గిల్ (15), కెప్టెన్ సూర్య (24) ఔటయ్యారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 8 ఓవర్లలో 82/3గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 72 బంతుల్లో 105 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News November 2, 2025
సిరిసిల్ల: రేపటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ళు

పత్తి పంటను సోమవారం నుండి కొనుగోలు చేసేందుకు సీసీఐ సిద్ధమైంది. వేములవాడ అర్బన్, రూరల్, చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రంగి మండలాలలో సుమారు మూడు లక్షల పైచిలుకు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నాంపల్లి, సంకేపల్లి, సుద్దాల లోని జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తి విక్రయించే రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.


