News February 27, 2025
భద్రకాళి చెరువులో రుద్రమదేవి.. AI PHOTO

సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, ఇతర చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన ఏఐ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రకాళి చెరువు మధ్యలో రాణి రుద్రమ దేవి విగ్రహం, చుట్టూ కోట కనిపించేలా జనరేట్ చేసిన ఓ ఏఐ ఫొటో ప్రస్తుతం ఓరుగల్లు ప్రజలను ఆకట్టుకుంటోంది. అది చూసిన వారంతా చెరువులో రుద్రమదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Similar News
News February 27, 2025
వరంగల్: ముగిసిన పోలింగ్.. 94 శాతం పోలింగ్

ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ జిల్లాలో మొత్తం 2352 ఓట్లకు 2214మంది ఉపాధ్యాయులు ఓటేశారు. మొత్తంగా 94.13 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News February 27, 2025
వరంగల్: మధ్యాహ్నం 2గంటల వరకు 75.64% పోలింగ్

వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 75.64 శాతం పోలింగ్ నమోదైనట్లు ఉపాధ్యాయ ఎన్నికల అధికారి తెలిపారు. వరంగల్ జిల్లాలో మొత్తం 2,352 ఓట్లకు మధ్యాహ్నం 2గంటల వరకు 1,779 ఓట్లు పోలైనట్లు చెప్పారు. 13మండలాల్లో 13 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News February 27, 2025
వరంగల్ జిల్లాలో 46.81% ఓటింగ్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం మెరుగుపడింది. 12 గంటల వరకు 46.81 శాతం అధికారులు వెల్లడించారు. వరంగల్ జిల్లాలో మొత్తం 2352 ఓట్లు ఉండగా, 1101 ఓట్లు పోలింగ్ అయ్యాయి. వద్దన్నపేట 54.35, రాయపర్తి 57.58, నెక్కొండ 74.65, ఖానాపూర్ 54.79, నర్సంపేట 51.2, చెన్నారావుపేట 52.54, పర్వతగిరి 53.85, సంగెం 56.06, నల్లబెల్లి 52.35, దుగ్గొండి 35, గీసుకొండ 65.56, వరంగల్ 41.58, కిల్లా వరంగల్ 40.9 నమోదయింది.