News February 27, 2025

భద్రకాళి చెరువులో రుద్రమదేవి.. AI PHOTO

image

సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, ఇతర చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన ఏఐ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రకాళి చెరువు మధ్యలో రాణి రుద్రమ దేవి విగ్రహం, చుట్టూ కోట కనిపించేలా జనరేట్ చేసిన ఓ ఏఐ ఫొటో ప్రస్తుతం ఓరుగల్లు ప్రజలను ఆకట్టుకుంటోంది. అది చూసిన వారంతా చెరువులో రుద్రమదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Similar News

News March 24, 2025

సిద్దిపేట జిల్లాలో పొలిటికల్ వార్

image

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, BRS పాదయాత్రలతో రాజకీయాలు వేడెక్కాయి. గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి రాజ్‌భవన్‌కు పాదయాత్ర చేపట్టగా.. BRS మాజీ MLA ‘ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోస’తో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. గజ్వేల్ MLA క్యాంపు ఆఫీస్‌కు బీజేపీ నేతలు TOLET బోర్డు పెట్టడంతో కాంగ్రెస్, బీజేపీ కావాలనే కుట్రలో భాగంగా కేసీఆర్‌ను భద్నం చేయాలని చూస్తున్నాయని BRS శ్రేణులు మండిపడుతున్నాయి. మరి మీ కామెంట్..

News March 24, 2025

అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

image

TG: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కాసేపటికి వీరి వద్దకు కేటీఆర్ వచ్చి వివేక్‌తో కాసేపు మాట్లాడారు. వీరిని ఓ ఎమ్మెల్యే ఫొటో తీస్తుండగా కేటీఆర్ వారించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నియోజకవర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

News March 24, 2025

SLBCలో ఆ ఏడుగురి ఆచూకీ లభించేనా..?

image

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ SLBC సొరంగం కూలి 8 మంది గల్లంతైన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న ఒకరి మృతదేహం లభించగా మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ నేటికీ లభించలేదు. ఈ ఘటన జరిగి నేటికి 31 రోజులు గడిచినా సొరంగంలో చిక్కుకున్న ఏడుగురి మృతదేహాలు లభించేనా అని అనుమానం వ్యక్తమవుతోంది. అధికారులు, సహాయక బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఆ ఏడుగురి ఆచూకీ మాత్రం దొరకడం లేదు.

error: Content is protected !!