News July 26, 2024
భద్రతా చర్యల ఆంక్షలను కఠినతరం చేయాలి: కలెక్టర్

ప్రజల ప్రాణ భద్రత కోసం చేపడుతున్న రోడ్డు భద్రత చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబందిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ హర్షవర్ధన్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలను కఠినతరం చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
Similar News
News December 4, 2025
కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
News December 4, 2025
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం చేయించాలనుకునేవారు ఒక్కో టికెట్కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.
News December 4, 2025
కడప: ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతులపై ఆరా.!

కడప జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ యాజమాన్యంలో జిల్లా ఆస్పత్రి, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, యునాని, హోమియో, ఆయుర్వేదం ఆస్పత్రులు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో 108 అల్లోపతి, 30 డెంటల్, 10 పిజియో థెరపీ, 8 హోమియో, 4 ఆయుర్వేదం ఆసుపత్రులు ఉన్నాయి. 38 డయాగ్నస్టిక్ స్కానింగ్ కేంద్రాలు, 13 ల్యాబ్లు ఉన్నాయి.


