News May 20, 2024
భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రవి నాయక్
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు. ఆదివారం పాలమూరు యూనివర్సిటీ వివిధ విభాగాల భవనాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పోలీస్ భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు.
Similar News
News December 9, 2024
MBNR: జోగులాంబ ఆలయానికి భారీగా ఆదాయం
అలంపూర్ ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నేడు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో రూ.1,06,04,436 సమకూరింది. ఈ ఆదాయం ఐదు నెలలు తర్వాత లెక్కింపులో ఇంత భారీ ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
News December 9, 2024
కొడంగల్ యువకుడికి రూ.2 కోట్ల వేతనం
కొడంగల్ యువకుడు జాక్ పాట్ కొట్టాడు. ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ. 2కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో అప్లయిడ్ సైంటిస్ట్‌గా బొంరాస్‌పేట మం. తుంకిమెట్ల యువకుడు సయ్యద్ అర్బజ్ ఖురేషి(26) సెలక్ట్ అయ్యారు. పట్నా ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఇతడు USAలోని UMASS యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్‌లో MS పట్టా పొందారు.
News December 9, 2024
తెలంగాణ తల్లి తొలివిగ్రహం.. మన పాలమూరులోనే !
రాహుల్ గాంధీ జోడోయాత్ర 2022 OCT 23న తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా కర్ణాటక సరిహద్దు టై రోడ్డులో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం యాత్ర 3 రోజుల విరామం తర్వాత OCT 27న నారాయణపేట జిల్లాలో పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో MBNR జిల్లా సరిహద్దు సీసీకుంట మం. లాల్ కోట ఎక్స్ రోడ్‌లో మరో విగ్రహం ఆవిష్కరించారు. ఇప్పుడు అదే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.