News May 24, 2024

భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత

image

భద్రాచలంలోని <<13306910>>మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత<<>> నెలకొంది. విద్యార్థిని కారుణ్య మృతి విషయం తెలుసుకున్న MLA తెల్లం వెంకట్రావ్ కాలేజీకి వచ్చి యజమాన్యంతో మాట్లాడారు. నిందితుల తరఫున వచ్చారా అని విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. కారుణ్య కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేందుకు MLA యత్నించినా వారు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు.

Similar News

News April 10, 2026

‘ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కొనసాగించాలి’

image

ఏపీలో కలిసిన భద్రాచలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని టీజీఈజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం ఖమ్మం టీఎన్జీవోస్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న భద్రాచలంలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ‘అభ్యర్థన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భద్రాద్రి పునరేకీకరణ విస్తృతస్థాయి అఖిలపక్ష సమావేశ పోస్టర్ ను ఆవిష్కరించారు.

News April 10, 2026

చేగోమ్మలో PACS గోదాం ప్రారంభించిన పొంగులేటి

image

కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన PACS గోదాములను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

News April 10, 2026

ఖమ్మంలో రేపు ఫూలే జయంతి వేడుకలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల ఫూలే విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి ఫూలే చేసిన సేవలను స్మరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.