News April 6, 2025
భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
Similar News
News April 16, 2025
కొత్తగూడెం: యువతి చదువుకు బాబుమోహన్ భరోసా

కొత్తగూడెం(D) అశ్వారావుపేటకు చెందిన యువతి చదువుకు ప్రముఖ నటుడు బాబు మోహన్ భరోసానిస్తూ ముందుకు వచ్చారు. మండలంలోని బండారిగుంపునకు చెందిన బైట గోపాలరావు రెండో కుమార్తె సమీప బీటెక్ పూర్తి చేసింది. ఎంటెక్ చదవడానికి బాబుమోహన్ ముందుకు వచ్చి తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద చదువు పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. చదువు పూర్తిచేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆయనకు తెలిపింది.
News April 16, 2025
భవిత కేంద్రాలను ఆధునీకరించాలి: అ.కలెక్టర్

ఖమ్మం: మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పి.శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో భవిత కేంద్రాల ఆధునీకరణపై ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భవిత కేంద్రాల ఆధునీకరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News April 15, 2025
KMM: నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారుల నియామకం

ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల పటిష్ట అమలుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ తెలిపారు. ఖమ్మంకు జడ్పీ సీఈఓ దీక్షా రైనా, పాలేరుకు ఎస్డీసీ రాజేశ్వరి, మధిరకు జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, వైరాకు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లికి ఎల్.రాజేంద్ర గౌడ్ ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు.