News April 6, 2025
భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
Similar News
News October 18, 2025
దీపావళి ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ఆఫర్‌లు, ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. కేవలం అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే కొనుగోళ్లు జరపాలని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింకులను తెరవవద్దని ఎస్పీ కోరారు. ఫేక్ ప్రకటనలు నమ్మి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
News October 18, 2025
‘K RAMP’ సినిమా రివ్యూ&రేటింగ్

అల్లరి చిల్లరగా తిరిగే రిచ్ ఫ్యామిలీ యువకుడు కాలేజీలో తాను ప్రేమించిన యువతి కోసం ఏం చేశాడు? ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి ఎలా బయటపడేశాడన్నదే ‘K RAMP’ కథ. కిరణ్ అబ్బవరం నటన, అక్కడక్కడ కామెడీ సీన్లు, కొన్ని మాస్ అంశాలు ఆకట్టుకుంటాయి. పాటలు, BGM ఫర్వాలేదనిపిస్తాయి. కొత్తదనం లేని కథ, ఇరికించినట్లుగా ఉండే కామెడీ, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బందిపెడతాయి.
రేటింగ్: 2.25/5
News October 18, 2025
జోగి రమేశ్, కల్తీ లిక్కర్ నిందితుడు జనార్ధన్‌ల ఫొటో వైరల్

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇటీవల కల్తీ లిక్కర్ నిందితుడు జనార్ధన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘జోగి, జనార్దన్ మిత్రబంధం గట్టిదే?’ వంటి ప్రశ్నలు వేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. ఇది YCP, TDP పట్ల వ్యూహాత్మక దిశలో కొత్త ప్రశ్నలకు దారి తీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.