News April 6, 2025
భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
Similar News
News April 22, 2025
ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్‌తో కలిసి సాయి ప్రకాశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.
News April 22, 2025
MLA వెంకట్రావు ద్రోహి : MLC కవిత

సోమవారం భద్రాచలంలో పర్యటించిన MLC కవిత స్థానిక MLA వెంకట్రావుపై విమర్శలు గుప్పించారు. BRS తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ద్రోహి వెంకట్రావు అని అన్నారు. భద్రాచలం అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తక్కువ స్థానాలోచ్చిన భద్రాచలం గెలుపు రికార్డన్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి మూడు పైసలు తీసుకురాలేదన్ని మండిపడ్డారు.
News April 22, 2025
నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు జెడ్డాలో ఆయన రెండు రోజులు పర్యటించనున్నారు. మోదీ, సల్మాన్ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో ఒప్పందాలపై సంతకాలతో పాటు ఆర్థిక, మిలిటరీ భాగస్వామ్యం, రాజకీయ సంబంధాలపై చర్చ జరగనుందని సౌదీలోని భారత అంబాసిడర్ అజాజ్ ఖాన్ వెల్లడించారు.