News March 1, 2025
భద్రాచలంలో ధారూర్ యువకుడి మృతి

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్ (20)గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News October 28, 2025
శ్రీరాంపూర్: ‘సింగరేణి మాజీ ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి’

సీపీఆర్ఎంఎస్ స్కీమ్లో సభ్యత్వం ఉన్న సింగరేణి మాజీ ఉద్యోగులు నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని సంస్థ జీఎం (పర్సనల్) జీవీకే కుమార్ తెలిపారు. డిజిటల్ మాధ్యమంలో జీవన్ ప్రమాణ్ ఆండ్రాయిడ్ ద్వారా మొబైల్ ఫోన్లలో లేదా మీ సేవ కేంద్రంలో సమర్పించి నిరాటంకంగా వైద్య సేవలు పొందాలని సూచించారు. పూర్తి వివరాలకు తమ ఏరియాలోని ఏటీబీ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.
News October 28, 2025
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు భారీ ఆదాయం

ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర దేవస్థానం హుండీలను సోమవారం లెక్కించగా, రూ. 4,33,85,655 ఆదాయం లభించింది. దీంతో పాటు 420 గ్రాముల బంగారం, 6 కిలోల 614 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీని భక్తులు సమర్పించారు. ఈవో శీనా నాయక్ పర్యవేక్షణలో 44 హుండీలను లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయ ఛైర్మన్తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News October 28, 2025
KNR: కీచక అటెండర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

KNR జిల్లా గంగాధర(M) కురిక్యాల ZPHSలోని బాలికల బాత్రూంలో అటెండర్ కెమెరా అమర్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో అటెండర్ యాకుబ్ పాషాను ఉద్యోగం నుంచి తొలగిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అటెండర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీనిపై MLA సత్యం, కేంద్రమంత్రి బండి, మాజీ MLA రవిశంకర్ స్పందించారు. ప్రతిపక్షాలూ గంగాధర ప్రధాన చౌరస్తాలో బైఠాయించాయి.


