News January 9, 2025
భద్రాచలంలో నేడు, రేపు తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736346784335_52286995-normal-WIFI.webp)
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా రాముల వారి తొమ్మిది రోజుల ఉత్సవ అవతారాలు నిన్నటితో ముగిశాయి. భక్తులకు స్వామి వారు రోజుకో రూపంలో దర్శనమిచ్చారు. 9వ తారీఖున (నేడు) సాయంత్రం 4 గంటలకు స్వామి వారి తెప్పోత్సవం గోదావరి నదిలో అంగరంగ వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 10న తెల్లవారుజామున 5 గంటలకు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Similar News
News January 16, 2025
ఖమ్మం: ఒక్క గ్రామంలో 10 మందికి టీచర్ ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736976089767_50621468-normal-WIFI.webp)
ఎర్రుపాలెం మండలం రాజులడేవరపాడులో 10 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి కొలువులు సాధించిన వారిని గ్రామస్థులు సన్మానించారు. దుద్దకూరు గోపిక్రిష్ణ యాదవ్, దుద్దుకూరు కృష్ణ వేణి, పొదిల సాంబయ్య మరికొందరు జాబ్స్ కొట్టిన వారిలో ఉన్నారు.
News January 16, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736988986462_11885857-normal-WIFI.webp)
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం & భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పర్యటన ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
News January 16, 2025
ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736957082511_19535177-normal-WIFI.webp)
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారికి తన భార్య పేరు పేర్కొనలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంలో కూనంనేని స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. తన రాజకీయ ప్రత్యర్థి వేసిన కేసులో ఆధారాలు లేవని, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని కూనంనేని తెలిపారు.