News March 13, 2025
భద్రాచలంలో పోస్టులు.. మార్చి 19న ఇంటర్వ్యూలు

ఖమ్మం రీజియన్లోని ఏకలవ్య పాఠశాలల్లో కౌన్సిలర్ పోస్టుల భర్తీ కోసం ఔట్సోర్సింగ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో పీ.రాహుల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19న తేదీన ఉదయం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
Similar News
News December 7, 2025
రాజమండ్రిలో నేటి చికెన్ ధరలు ఇలా

రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్, మటన్కు డిమాండ్ భారీగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.250గా ఉండగా, స్కిన్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.140-150 మధ్య లభిస్తోంది. ఇక, మటన్ ధర కేజీకి రూ.900గా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు నమోదవుతున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు జిల్లా చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ. 2కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు.
News December 7, 2025
తిరుపతి: అటు ర్యాగింగ్… ఇటు లైంగిక వేధింపులు

ఎస్వీయూలో ఇటీవల ర్యాగింగ్ కలకలం.. తాజాగా NSU లైంగిక వేధింపులతో తిరుపతి విద్యా కేంద్రానికి చెడ్డపేరు వచ్చింది. ఇలాంటి విద్యాలయాల్లో యువతులకు భద్రత ఎంత? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూనివర్సిటీల కమిటీలు, మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వర్సిటీల అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాలి.


