News March 13, 2025

భద్రాచలంలో పోస్టులు.. మార్చి 19న ఇంటర్వ్యూలు

image

ఖమ్మం రీజియన్‌లోని ఏకలవ్య పాఠశాలల్లో కౌన్సిలర్ పోస్టుల భర్తీ కోసం ఔట్‌సోర్సింగ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో పీ.రాహుల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19న తేదీన ఉదయం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

Similar News

News February 9, 2026

గేమింగ్ స్కామ్‌.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

image

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్‌ను DGGI అధికారులు బయటపెట్టారు. ఫిన్‌టెక్ పేరుతో ₹5వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు తేల్చారు. పలు వెబ్‌సైట్లతో అక్రమ దందా చేశారని, GST ఎగ్గొట్టారని తెలుస్తోంది. ఓషనీక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్‌విన్ సొల్యూషన్స్ అనే షెల్ కంపెనీలకు రెంటెడ్ ఖాతాలతో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని, మాస్టర్‌మైండ్ దుబాయ్‌లో ఉన్నాడని సమాచారం.

News February 9, 2026

మోత్కూరు: బాండ్ పేపర్‌పై హామీలు.. నచ్చకపోతే రిజైన్

image

మోత్కూరు మున్సిపాలిటీ 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గుమ్మడవెల్లి పరశురాములు రూ.100 బాండ్ పేపర్‌పై తన ఎన్నికల హామీలను రాసి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. తనను గెలిపిస్తే ఐదేళ్ల జీతాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వెచ్చిస్తానని, రెండున్నరేళ్ల తర్వాత తన పని నచ్చకపోతే రాజీనామా చేస్తానని బాండ్ సాక్షిగా హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడనని, ఓటర్లను ప్రలోభపెట్టనని ఆయన స్పష్టం చేశారు.

News February 9, 2026

రేవంత్‌కు ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చే ముఖం లేదు: హరీశ్‌రావు

image

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చే ముఖం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్కీముల పేరుతో అధికారంలోకి వచ్చి స్కామ్‌లకు తెరలేపిందని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం అవినీతే రాజ్యమేలుతోందని ఆయన ధ్వజమెత్తారు.