News April 24, 2025
భద్రాచలంలో 43.1°C అత్యధిక ఉష్ణోగ్రత

జిల్లాలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా భద్రాచలంలో 43.1°C ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా దమ్మపేటలో 39.1°C ఉష్ణోగ్రత నమోదైంది. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం మండలాల్లో 43°C, కరకగూడెంలో 42.9°C, చుంచుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, మణుగూరు మండలాల్లో 42.7°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News April 24, 2025
అనకాపల్లి: 590 ప్లస్ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు

అనకాపల్లి జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులను కలెక్టర్ విజయకృష్ణన్ కలెక్టరేట్లో గురువారం అభినందించి మెమెంటోలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 590కి పైగా మార్కులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 9 మంది విద్యార్థులు సాధించడం హర్షించతగ్గ విషయం అన్నారు. అనకాపల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు.
News April 24, 2025
పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో కోటవురట్ల మండలం

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో కోటవురట్ల మండలం అనకాపల్లి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎంఈవోలు రామారావు, జోషి గురువారం తెలిపారు. మండలంలోని నాలుగు జడ్పీ హైస్కూల్స్ ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక కస్తూర్బా విద్యాలయం నుంచి 443 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 434 మంది ఉత్తీర్ణులు అయినట్లు పేర్కొన్నారు. 97.97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.
News April 24, 2025
రాష్ట్రపతితో షా, జైశంకర్ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చర్యలను రాష్ట్రపతికి వివరించారు. దేశ భద్రత, పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలపై చర్చించారు.