News January 30, 2025
భద్రాచలంలో 82 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం చెక్పోస్ట్ వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్న నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులకు కారులో సుమారు 81.950 కేజీల ఎండు గంజాయిని గుర్తించారు. కారులో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, గంజాయి, కారును భద్రాచలం పోలీసులకు విచారణ నిమిత్తం అప్పగించారు.
Similar News
News November 16, 2025
ఆసిఫాబాద్: ప్రత్యేక లోక్ అదాలత్లో 842 కేసులు పరిష్కారం

కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకుని డబ్బు, సమయం ఆదా చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వీ రమేష్ సూచించారు. శనివారం ఆసిఫాబాద్లోని న్యాయస్థానంలో జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా వివిధ కోర్టుల్లోని 842 కేసులు పరిష్కారం అయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి పాల్గొన్నారు.
News November 16, 2025
సూర్యాపేట జిల్లాలో 25 వేల మంది దరఖాస్తుదారులు

చేయూత పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. సూర్యాపేట జిల్లాలో సుమారు 25 వేల దరఖాస్తులు మండల పరిషత్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి, పెండింగ్లో ఉన్న కొత్త పింఛన్లను మంజూరు చేయాలని దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News November 16, 2025
జగదాంబ జంక్షన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

జగదాంబ జంక్షన్లోని బస్స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఇంకా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGH మార్చురీకి తరలించామని అతని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.


