News March 13, 2025
భద్రాచలం: ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే కళ్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 నుంచి ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు తానీషా కళ్యాణ మండపంలో టికెట్లు పొందాలని సూచించారు.
Similar News
News November 15, 2025
సోమశిల లాంచి ప్రయాణంలో పర్యాటకులకు ఆటలు

కృష్ణానదిలో సాగే సోమశిల – శ్రీశైలం క్రూయిజ్ లాంచీ ప్రయాణంలో టూరిజం సిబ్బంది పర్యాటకులను ఎంటర్ టైన్ చేయడానికి ఫన్నీ గేమ్స్ నిర్వహించారు. ఇందులో మొదటి బహుమతి గెలుపొందిన కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ పాపిరెడ్డికి నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ బహుమతిని అందజేశారు. కృష్ణానదిలో టూరిజం ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఆ శాఖ మంత్రి జూపల్లికి పాపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News November 15, 2025
కృష్ణా: పంట ఎంపికలో చిక్కుకున్న రైతన్నలు

ఖరీఫ్ సీజన్ ముగిసిన తరువాత రెండో పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నా ప్రభుత్వం నుంచి రబీ సీజన్‌పై స్పష్టత లేకపోవడంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. రబీని అధికారికంగా ప్రకటిస్తే వరి వంగడాలు కొనుగోలు చేయాలా? లేక అపరాల వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. పొలం అదును పోయే పరిస్థితి వస్తే అపరాల పంటలకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని, సాగు ఖర్చులు రెట్టింపు అవుతాయని అంటున్నారు.
News November 15, 2025
మల్యాల: ‘కొనుగోలు కేంద్రాల్లో వసతులు మెరుగుపరచాలి’

మల్యాల మండలం కొండగట్టు, ముత్యంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత శనివారం పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి అదేరోజు రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు.


