News September 6, 2024

భద్రాచలం ఎమ్మెల్యేపై నమోదైన కేసు కొట్టివేత  

image

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావుకు ప్రథమ శ్రేణి కోర్టులో ఊరట లభించింది. 2018 ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన వెంకట్రావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు నగదు పంపిణీ చేయించారని కేసు నమోదైంది. వెంకట్రావుపై పట్టణ పోలీసులు ఏ-2గా చార్జిషీట్ ఫైల్ చేసి కోర్టులో కేసు వేశారు.

Similar News

News November 24, 2025

ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం

image

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతిల్లు కట్టుకోవాలనుకున్న పేదలకు పెరిగిన ఇసుక, ఇటుక ధరలు గుదిబండగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రూ.8 వేల నుంచి రూ.12 వేలు, ఇటుక రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తుండటంతో నిర్మాణం భారమైంది. ‘దేవుడు కరుణించినా, వ్యాపారులు కరుణించలేదు’అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 24, 2025

ఖమ్మం జిల్లాలో లక్ష నుంచి 30వేల ఎకరాలకు

image

ఖమ్మం జిల్లాలో మూడేళ్లుగా మిర్చిసాగు క్రమంగా తగ్గుతోంది. ధర, దిగుమతి లేకపోవడంతో రైతులు విముఖత చూపుతున్నారు.2020లో జిల్లాలో 1,08లక్షల ఎకరాలు మిర్చి సాగు చేశారు. 2023లో 92,274, 2024లో 59.205, ఈ ఏడాది 31,741ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 3ఏళ్ల క్రితం క్వింటా రూ. 25వేలు పలికింది. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ ప్రస్తుతం రూ. 15వేల లోపే ఉంది. చైనాలో మిర్చిసాగు పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.

News November 24, 2025

ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

image

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 571 గ్రామపంచాయతీలకు 5,214 పోలింగ్ స్టేషన్‌లు, 6,258 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల విధులకు సుమారు14,092మంది సిబ్బంది అవసరమని గుర్తించి, శిక్షణ పూర్తి చేశారు. వీరిలో పోలీంగ్ ఆఫీసర్లు 6,258, ఓపీవోలు 7,834 మందిని నియమించారు.