News April 11, 2024
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఏడాది బాలుడు మృతి

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఓ పసిబిడ్డ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సోమిడి – శుక్లాన్ దంపతుల ఏడాది కుమారుడికి జ్వరం, దగ్గు, ఆయాసం రావడంతో భద్రాచలం ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మృతి చెందాడు. బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడని ఆర్ఎంవో రాజశేఖర్ తెలిపారు.
Similar News
News February 10, 2026
ఖమ్మం: తెలంగాణ పోరాట యోధురాలు మృతి

తెలంగాణ పోరాట యోధురాలు గండూరి నర్సు బాయమ్మ మరణించారు. ఖమ్మం పరిధి మామిండ్ల గూడెంలో నివాసం ఉంటున్న ఆమె అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆమె భర్త, సీపీఎం నేత గండ్లూరి కిషన్‌రావు 1976లో మామిండ్లగూడెంలోని తన ఇంటి సమీపంలోనే హత్యకు గురయ్యారు. ఆమె గతంలో ముదిగొండ మండలం బాణాపురం సర్పంచ్‌గా పని చేశారు. నర్సు బాయమ్మ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
News February 10, 2026
సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఫిబ్రవరి 11న ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపల్ పరిధుల్లో పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా యజమానులు సహకరించాలని కోరారు.
News February 10, 2026
ఖమ్మం: రెండు రోజులు సెలవు ప్రకటించిన కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈనెల 11న జరగనున్న ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ జరగనున్న వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, ఏదులాపురం పరిధిలో ఈనెల 10, 11వ తేదీల్లో స్థానికంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 11న జరిగే పోలింగ్‌లో ఓటర్లందరూ పాల్గొనేలా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. కాగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.


