News April 18, 2024
భద్రాచలం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్
భద్రాచలంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పోలీస్ అధికారులు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. భద్రాచలం టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్, నవీన్‌లు ఒకే విషయంలో 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2024
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన తుమ్మల
మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన కరుణ, సహనం, సమైక్యత, సామరస్యం, విశ్వ మానవ సోదర భావం.. నిత్యం మనందరిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటాయని, అందరి మేలు కోసం పని చేసేలా ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజని పేర్కొన్నారు.
News September 16, 2024
KMM: వాకింగ్ చేస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
గుండెపోటుతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణాపురం గ్రామానికి చెందిన వట్టికూటి రమేష్ బాబు ఉదయం వాకింగ్ చేస్తూ ఒకసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. రమేష్ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
News September 16, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేశుని నిమర్జన వేడుకలు
>ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
>వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి
>అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
>ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన