News July 20, 2024
భద్రాచలం: ఐటీడీఏ కేంద్రంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీడీఏ కేంద్రంగా ప్రధాన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులో 79952 68352 నెంబర్కు కాల్ చేయాలని ఐటిడిఏ అధికారులు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమై మైదాన ప్రాంతాలకు రావాలని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించారు.
Similar News
News November 26, 2025
ఖమ్మం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఎదురు చూపులు

ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరిపి కాటాలు వేసినా రవాణాకు ట్రాక్టర్లు, లారీలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మిల్లర్ల వద్ద అన్లోడింగ్ సమస్యలు ఉండటంతో వాహన యజమానులు రవాణాకు నిరాకరిస్తున్నారు. కల్లూరు మండలంలో సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ట్రాన్స్పోర్ట్ సమస్య తీవ్రంగా మారిందని, తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 26, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
News November 26, 2025
ఖమ్మం: మహిళలకే 259 సర్పంచ్ స్థానాలు

ఖమ్మం జిల్లాలోని 566 పంచాయతీలకు, 5,166 వార్డులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఎస్టీలకు 166, ఎస్సీలకు 110, బీసీలకు 54, జనరల్ స్థానాలు 236 కేటాయించారు. జిల్లావ్యాప్తంగా మహిళలకు 259 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇప్పటికే ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా, మొదటి విడత మండలాల్లో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.


