News July 20, 2024
భద్రాచలం: ఐటీడీఏ కేంద్రంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీడీఏ కేంద్రంగా ప్రధాన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులో 79952 68352 నెంబర్‌కు కాల్ చేయాలని ఐటిడిఏ అధికారులు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమై మైదాన ప్రాంతాలకు రావాలని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించారు.
Similar News
News October 7, 2024
రేపు ఖమ్మం నగరంలో డిప్యూటీ సీఎం పర్యటన
ఖమ్మం నగరంలో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టరేట్‌లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎంపీడీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. తదనంతరం డిప్యూటీ సీఎం బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
News October 7, 2024
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం దంపతులు
ఖమ్మం రూరల్: నాయుడుపేటలో ఏర్పాటుచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముస్లిం దంపతులు షేక్ సోందు- నైదాభి దర్శించుకున్నారు. అమ్మవారికి ముస్లిం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. హిందూ దేవత అయిన దుర్గమ్మకు పూజలు నిర్వహించిన ముస్లిం దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు. కాగా షేక్ సొందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
News October 7, 2024
సత్తుపల్లి: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య
సత్తుపల్లి మండలం<<14289034>> రేగళ్లపాడుకి చెందిన సైద్‌పాషా సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పాషా స్నేహితుడు ఖాసుబాబు వారం కిందట పాషా సెల్‌ఫోన్ నుంచి ఓ వివాహితకు కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ వివాహిత తన భర్తకి ఈ విషయం తెలియడంతో పాషా షాప్ దగ్గరకు వచ్చి అతడిపై దాడి చేశాడు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించానని అవమానంగా భావించిన పాషా సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.