News October 14, 2024
భద్రాచలం: గిరిజన యువతి యువకుల నుంచి దరఖాస్తుల స్వీకరణ: పీవో

గిరిజన ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు బ్యూటీషియన్, టైలరింగ్, తేనెటీగల పెంపకం కోర్సులపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీవో పీవో రాహుల్ తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగ గిరిజన యువత విద్యార్హత పత్రాలు, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్, రేషన్ కార్డ్/ఉపాధిహామీ బుక్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్తో ఈనెల 18 లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు.
Similar News
News December 29, 2025
ఖమ్మం జిల్లాలో సరిపడా యూరియా ఉంది: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో సరిపడా యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. నెల రోజులకు సంబంధించి 13,642 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 9,407 మెట్రిక్ టన్నుల స్టాక్ వచ్చిందన్నారు. మరో 5,100 మెట్రిక్ టన్నుల స్టాక్ రిజర్వ్ ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 29, 2025
ఖమ్మం: పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు: టౌన్ ఏసీపీ

సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని రౌడీషీటర్లకు టౌన్ ఏసీపీ రమణమూర్తి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ ఒక్కొక్కరి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వారు ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారు. ఏం పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఏసీపీ రౌడీ షీటర్లను హెచ్చరించారు.
News December 29, 2025
ఖమ్మం: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని పేర్కొన్నారు.


