News February 19, 2025

భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద భద్రత పెంపు

image

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ వద్ద ఉన్న ఉమ్మడి చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటీవల గంజాయి స్మగ్లర్లు ద్విచక్ర వాహనంతో వాహనాల తనిఖీ చేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ని వేగంగా ఢీకొట్టి పారిపోయాడు. ఇలాంటి ఘటనలు మరోమారు ఉత్పన్నం కాకుండా భద్రాచలం టౌన్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టారు.

Similar News

News November 24, 2025

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వినూత్న కార్యక్రమం

image

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేపట్టిన ‘చదవండి.. అర్థం చేసుకొండి.. ఎదగండి’ కార్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతోంది. 958 పాఠశాలల్లోని 28,982 మంది విద్యార్థులకు దీనిని అమలు చేస్తున్నారు. కలెక్టర్ చొరవతో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగైందని విద్యా యంత్రాంగం గుర్తించింది.

News November 24, 2025

ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణ శరవేగం.. నెరవేరనున్న యువత కలలు

image

ఖమ్మం జిల్లాలో ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త ఐటీ కంపెనీలకు సౌకర్యాలు, రాయితీలను ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం 2 వేల మంది ఉద్యోగులు ఉండగా, రాబోయే ఐదేళ్లలో 10 వేలకు పైగా ఐటీ ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కనున్నాయని అధికారులు తెలిపారు.

News November 24, 2025

ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం

image

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతిల్లు కట్టుకోవాలనుకున్న పేదలకు పెరిగిన ఇసుక, ఇటుక ధరలు గుదిబండగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రూ.8 వేల నుంచి రూ.12 వేలు, ఇటుక రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తుండటంతో నిర్మాణం భారమైంది. ‘దేవుడు కరుణించినా, వ్యాపారులు కరుణించలేదు’అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.