News November 9, 2024

భద్రాచలం టెంపుల్ వసతి గృహం నుంచి పడి మృతి 

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వసతి గృహం భవనం నుంచి కిందకు పడి ఓ భక్తుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సీఆర్ఓ కార్యాలయం సమీపంలోని రామాసదనంపై అంతస్తు నుంచి చెన్నైకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలతో మరణించినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News December 9, 2024

గుడ్ల ధరలు పెరుగుతున్నాయ్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండగా, తాజాగా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో ఒకో గుడ్డు రూ.5.90 ఉండగా, రిటైల్‌గా రూ.7 వరకు పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్డుల ధర బహిరంగ మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.84 వరకు ఉండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది.

News December 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} అన్నపు రెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పినపాకలో బీఆర్ఎస్ కార్యక్రమం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

News December 9, 2024

విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు సర్వ సిద్ధం

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 9, 10 తారీకుల్లో ఎస్ఎఫ్ఎస్ బల్లేపల్లి, పాఠశాలలోని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రాంగణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు ఏర్పాట్లు చేసినట్లు డిఈఓ సోమశేఖర్ శర్మ తెలిపారు. ప్రదర్శనలో ఇన్స్పైర్‌కు 119 ఎగ్జిబిట్లు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 486 ఎగ్జిబిట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయన్నారు.