News April 9, 2025
భద్రాచలం డిపో ఆదాయం రూ.92.61 లక్షలు

భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం పురస్కరించుకుని భద్రాచలం డిపో పరిధిలో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు వివిధ మార్గాలలో మొత్తం 78 ప్రత్యేక బస్సులు నడిపినట్లు డీఎం బి.తిరుపతి తెలిపారు. ఈ మూడు రోజుల్లో ప్రత్యేక బస్సులు మొత్తం రూ.1,52,188 కి.మీ పయనించగా రూ.92.61 లక్షల ఆదాయం డిపోకు లభించిందన్నారు. మొత్తం 82,138 మంది ప్రయాణించగా వారిలో 37,639 మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని చెప్పారు.
Similar News
News October 14, 2025
శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ

ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పరిశీలించారు. హెలిప్యాడ్, రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్, శివాజీ స్ఫూర్తి కేంద్రం, గుడి పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News October 14, 2025
వరంగల్: వాట్ అన్ ఐడియా సర్ జీ..!

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ ఇంటి స్థలం అమ్మకానికి యజమాని ఎంచుకున్న పద్ధతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 108 గజాల స్థలం, ఇంటిని కేవలం రూ.500 కూపన్‌తో లక్కీ డ్రా ద్వారా గెలుచుకునే అద్భుతమైన అవకాశం కల్పించాడు. 3 వేల కూపన్లు ముద్రించామని వచ్చే ఏడాది జనవరి 15న గుంజేడు ముసలమ్మ దేవస్థానం వద్ద డ్రా తీయనున్నట్లు చెప్పాడు. రిజిస్ట్రేషన్ ఫీజులను విజేత భరించాలని పేర్కొన్నాడు.
News October 14, 2025
BREAKING: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ప్రతిష్ఠాత్మక టెక్ కంపెనీ గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలపై అగ్రిమెంట్ కుదిరింది. CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.88,628 కోట్లతో ఒక గిగావాట్ కెపాసిటీతో 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తికి గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.