News April 6, 2025
భద్రాచలం: తలంబ్రాల కౌంటర్ల వద్ద భక్తుల కిటకిట

భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో లడ్డూ ప్రసాదంతోపాటు మహా ప్రసాదం, స్వామివారి తలంబ్రాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పహారా కాస్తున్నారు.
Similar News
News November 28, 2025
సత్యసాయి జిల్లా యువతికి అరుదైన ఛాన్స్

సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంభాలట్టికి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. టీమ్ ఇండియా అంధుల జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఇటీవల టీ20 ప్రపంచకప్ను గెలిపించిన దీపిక, గురువారం జట్టు సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీపిక ప్రధానితో ఫొటో దిగారు. ప్రధాని మోదీ ఆమెను అభినందించారు.
News November 28, 2025
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- 2025 లోగో ఇదే!

భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లకు సంబంధించిన పురోగతిని సీఎం స్వయంగా తెలుసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమ్మిట్కు సంబంధించిన లోగోను తాజాగా విడుదల చేశారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఈ సమ్మిట్లో ప్రధాన అంశమని అధికారులు తెలిపారు.
News November 28, 2025
కరీంనగర్: NMMSS ‘కీ’ విడుదల

8వ తరగతి విద్యార్థులకు ఈనెల 23న నిర్వహించిన NMMSS స్కాలర్ షిప్ అర్హత పరీక్ష KEY విడుదలైందని కరీంనగర్ DEO మొండయ్య తెలిపారు. కీ పేపర్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6 వరకు http/bse.telangana.gov.in సైట్లో లేదా dirgovexams.tg@gmail.comకి పంపాలని అన్నారు. లేదా డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, హైదరాబాద్ నందు సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 6 తరువాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబడవని అన్నారు.


