News March 22, 2025
భద్రాచలం పంచాయతీ ఆదాయం రూ.1.25 కోట్లు

భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం వేలం పాట నిర్వహించగా ఆశీలు రూ.1.25కోట్లకు రంగా అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. గోదావరి నదిలో బోట్లకి రూ.27.25 లక్షలు, చర్ల రోడ్డులో వారసంతకు రూ.3.80లక్షలు, మరో మూడు దుకాణాలకు 3.67లక్షలు పలికాయి. కాగా మరోసారి ఆశీలు టెండర్ దక్కించుకునేందుకు పాత గుత్తేదారు రూ.1.23 కోట్ల వరకు పాట పాడారు. వీటి ద్వారా ఏడాది జీపీకి అదనపు ఆదాయం రానుంది.
Similar News
News November 27, 2025
విశాఖ: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున జరిగింది. సింహాచలం డిపో నుంచి గోపాలపట్నం వైపు బస్సు వెళుతుండగా.. రోడ్డు మీద నడుస్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా చక్రాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గోపాలపట్నం ఎస్సై అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 27, 2025
కీరదోసలో ఆకుమచ్చ, వెర్రి తెగులు నివారణ

కీరదోసలో ఆకులమచ్చ తెగులు వల్ల ఆకులపై చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి, తర్వాత ఇవి పెద్దగా మారి ఆకు ఎండి రాలిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు వల్ల ఆకులలో ఈనెలు ఉండే ప్రాంతంలో చారలు ఏర్పడి, మొక్క గిడస బారి, పూత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2mlను కలిపి పిచికారీ చేయాలి.
News November 27, 2025
2030లో బంగారం విలువ ఎంత ఉండనుంది?

గత 25 ఏళ్లలో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. 2000లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.4,400 కాగా ఇప్పుడు అది దాదాపు రూ.1,25,000కి చేరింది. సుమారు 14% కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో స్థిరంగా పెరుగుతోంది. ప్రస్తుతం రూ.5 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 2030 నాటికి రూ.10 లక్షలు దాటే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు. అయితే పసిడి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి.


