News March 23, 2025
భద్రాచలం: పర్ణశాల వేలం రూ.10,625,000

పర్ణశాల జీపీ ప్రత్యేకాధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో గోదావరి నదిలో బోటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన వేలం పాట నందు తెల్లం భీమరాజు రూ.44,40,000 మొత్తానికి దక్కించుకున్నారు. వాహనాల పార్కింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన పాలం పాట నందు వెంకటరమణ రూ.61,00,000 దక్కించుకున్నారు. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్వహణకు రూ.85,000 పాట అయిందని పంచాయతీ కార్యదర్శి సంపత్ తెలిపారు.
Similar News
News April 20, 2025
పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో మృతదేహం

మోత్కూరు మండలం పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్ రెడ్డిగా గుర్తించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.
News April 20, 2025
మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతున్నాయి. అధిక వేడి కారణంగా కొందరు వడదెబ్బకు గురై అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ తగిలిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారంతోపాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలో మార్పులు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
News April 20, 2025
చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన KCR

ఏపీ సీఎం చంద్రబాబుకు KCR జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు BRS ట్వీట్ చేసింది. ‘నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని KCR ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కేసీఆర్ కోరుకున్నారు’ అని పేర్కొంది. అటు విజయసాయిరెడ్డి కూడా CBNకు విషెస్ చెప్పారు.