News February 10, 2025

భద్రాచలం: ప్రతి గిరిజన కుటుంబానికి జీవనోపాధి: ఐటీడీఏ పీవో

image

అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఐటీడీఏ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బారులో వివిధ ఆదివాసీ గిరిజన గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత యూనిట్ అధికారులకు పంపుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పీవో ఆదేశించారు.

Similar News

News October 16, 2025

నచ్చిన ఫుడ్ ఇష్టమొచ్చినట్లు తినేస్తున్నారా?

image

చాలామంది ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కారు. నచ్చిన టిఫిన్ అనో, నాన్ వెజ్ కూరనో ఆకలితో సంబంధం లేకుండా పరిమితికి మించి లాగించేస్తుంటారు. కొందరైతే ఫేవరెట్ ఫుడ్ కనిపిస్తే ఇష్టమొచ్చినట్లు తినేస్తారు. అలాంటి వాళ్లు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ‘ఆహారం మితంగా తింటేనే ఆరోగ్యం.. అతిగా తింటే ఆయుక్షీణం’. అందుకే టిఫిన్, లంచ్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా కంట్రోల్డ్‌గా తీసుకోండి. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం.

News October 16, 2025

SRD: NMMSకు దరఖాస్తు గడువు పొడిగింపు

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.1000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.

News October 16, 2025

బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో ఎక్సైజ్ సురక్షా యాప్‌ను ఇప్పటివరకు 27 వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు CM చంద్రబాబుకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదన్నారు. మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని CM ఆదేశించారు. త్వరలో బీర్ బాటిళ్లకు కూడా బార్‌కోడ్ పెట్టాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.