News December 21, 2024
భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో బాల భీముడు జననం
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ 5. 25 కిలోల మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన శుక్రవారం భద్రాచలంలో చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం ఇరవైండికి చెందిన నందినికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నందినికి వైద్యులు డెలీవరి చేశారు. ఈ ప్రసవంలో 5. 25 కిలోలు ఉన్న బాలభీముడుకు నందిని జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News December 22, 2024
పురుగు మందు సేవించి యువకుడు మృతి
మానసిక వేదనకు గురై పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ గార్ల మం. పినిరెడ్డిగూడెం చెందిన బానోత్ వంశీ అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రియాజ్ పాషా తెలిపారు. వంశీ గతంలో ఒక యువతిని ప్రేమించగా ఆమె కొద్ది రోజుల క్రితం చనిపోయింది. వంశీ మనస్తాపంతో పురుగు మందు సేవించి మృతి చెందాడు. మృతుడి తల్లి భద్రమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News December 22, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News December 21, 2024
అధికారులు ఏం చేయలేమంటున్నారు: తాతా మధు
భద్రాచలం, పినపాక, మధిర, ములుగు నియోజకవర్గాల నుంచి కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని MLC తాతా మధు ఆరోపించారు. ఈరోజు ఆయన మండలిలో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ‘లారీలు పట్టకుంటున్నా మంత్రి గారి కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి మేమేం చేయలేం’ అని అధికారులు చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.