News December 21, 2024
భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో బాల భీముడు జననం

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ 5. 25 కిలోల మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన శుక్రవారం భద్రాచలంలో చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం ఇరవైండికి చెందిన నందినికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నందినికి వైద్యులు డెలీవరి చేశారు. ఈ ప్రసవంలో 5. 25 కిలోలు ఉన్న బాలభీముడుకు నందిని జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News April 16, 2026
ఖమ్మంలో 18న జాబ్ మేళా.. డిగ్రీ అర్హతతో 20 ఉద్యోగాలు

ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఈనెల 18న టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 20 ఖాళీల భర్తీకి డిగ్రీ అర్హత గల 20-40 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతో శనివారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు.
News April 16, 2026
ఖమ్మం: సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కీలక నేతగా..

కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నగర అధ్యక్షుడిగా, టీపీసీసీ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ జావిద్ ఎదిగారు. రాహుల్ గాంధీ జోడోయాత్ర, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఏడేళ్లు ఖమ్మం నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయగా, పార్టీ కార్యాలయంలో గత మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జావిద్‌ను సత్కరించారు.
News April 15, 2026
ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి

తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్ మృతితో మండలంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సంతాపం వ్యక్తం చేశారు.


