News March 4, 2025

భద్రాచలం బిడ్డకు అత్యున్నత పదవి..!

image

భద్రాచలం సీనియర్ న్యాయవాది జెట్టి సాల్మన్ రాజుని తెలంగాణ హైకోర్టు ఏజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న సాల్మన్ రాజు సోమవారం హైకోర్టు ఏజీపీగా నియమితుడై హైకోర్టు అడిషనల్ జనరల్ రంజిత్ రెడ్డి చేతులు మీదుగా నియామక పత్రాన్ని స్వీకరించారు. భద్రాచలం న్యాయవాది హైకోర్టు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 22, 2025

గుడిలో దండలు మార్చుకుని.. IASల ఆదర్శ వివాహం

image

AP: పెళ్లంటే ఆర్భాటం కాదు అర్థం చేసుకోవడమేనని నిరూపించారు ఇద్దరు ఐఏఎస్‌లు. విశాఖ కైలాసగిరి శివాలయంలో నిరాడంబరంగా దండలు మార్చుకుని, తర్వాత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసి దంపతులయ్యారు. అల్లూరి జిల్లా పాడేరు ITDA ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీపూజ, మేఘాలయలోని దాదెంగ్రి జాయింట్ కలెక్టర్ ఆదిత్య వర్మల వివాహ తంతు ఇలా సింపుల్‌గా పూర్తయ్యింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం విశేషం.

News November 22, 2025

ధాన్యం సేకరణపై అధికారులతో బాపట్ల కలెక్టర్ సమీక్ష

image

బాపట్ల జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియపై జిల్లా, మండల, సచివాలయాల స్థాయి అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణను పూర్తిగా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ధాన్యం సేకరణ గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

News November 22, 2025

శైలజానాథ్‌కు YS జగన్ ఫోన్

image

శింగనమల వైసీపీ ఇన్‌‌ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మరణంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శైలజానాథ్‌కు శుక్రవారం రాత్రి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.